Munugode By Election On Campaign Revanth: మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కేంద్రం, రాష్ట్రాన్ని ఏలుతున్న భాజపా, తెరాస మునుగోడు ప్రజలకు చేసిందేమి లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఒరగబెట్టింది శూన్యమని ఆరోపించారు.
డిండి, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తిచేయలేదన్న రేవంత్.. భూనిర్వాసితులకు న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. నియోజకవర్గ ఆడబిడ్డ స్రవంతి గెలిపించాలని ఓటర్లను రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. కుటుంబ పెత్తనం, కుటుంబ బాధ్యత ఆడబిడ్డ చేతిలో పెడితేనే బాగుంటుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి అక్కడి వారిని కోరారు.