నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా దగ్గర అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని రాస్తారోకో నిర్వహించారు. రైతు వేదికల భవన నిర్మాణ అనుమతుల పేరుతో మునుగోడు మండలమే కాకుండా ఇతర మండలాలకు అధికారులు డబ్బులకు లాలూచీపడి పర్మిషన్ ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వపరంగా మంజూరైన పని పేరు చెప్పుకొని అక్రమ ఇసుక తరలించడం వల్ల మునుగోడు ప్రాంతం ఏడారిగా మారుతుందన్నారు. అసలే ఫ్లోరైడ్ ప్రాంతం ఆపై ఉన్న ఇసుకను తరలించడం మూలంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగు, తాగు నీటికి ఎద్దడి ఏర్పడుతుందన్నారు.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని రాస్తారోకో - nalgonda district news
మునుగోడు మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా దగ్గర అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
రైతులు ఆరుగాలం కష్టపడి వరినాట్లు వేసుకుంటే ఇసుక తరలిపోవడం వల్ల నీళ్లు లేక పైర్లు ఎండి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మిర్యాల వెంకన్న, సీపీఐ మండల కార్యదర్శి సుడి చలపతి, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శీను, సీఐటీయూ మండల కార్యదర్శి శీను, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పి,పర్వతాలు,,పి.చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అధికారిక గృహాలు అన్యాక్రాంతం.. అప్పగించాలని పురపాలిక ఆదేశం!