నల్గొండ జిల్లా కేంద్రంలోని వి.టి. కాలనిలో రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి... కేక్ కట్ చేశారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి రక్తదానం చేశారు. రాజీవ్ గాంధీ ఐటీ రంగానికి పెద్ద పీట వేశారని, తన లాంటి నాయకులు రాజకీయంగా ఎదగడానికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు.
రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో కోమటిరెడ్డి రక్తదానం - rajiv-gandhi-jayanti-celebration
నల్గొండలో నిర్వహించి రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రక్తదానం చేశారు.
రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో కోమటిరెడ్డి రక్తదానం