తెలంగాణ

telangana

ETV Bharat / state

Rajagopal Reddy To Join Congress : బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. ఈనెల 27న సొంత గూటికి

Rajagopal Reddy
Rajagopal Reddy To Join Congress

By ETV Bharat Telangana Team

Published : Oct 25, 2023, 11:41 AM IST

Updated : Oct 25, 2023, 1:12 PM IST

11:36 October 25

Rajagopal Reddy Joins Congress : బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

Rajagopal Reddy To Join Congress :నల్గొండ జిల్లాలోని మునుగోడు మాజీ ఎమ్మెల్యేకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈనెల 27వ తేదీన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. ఇవాళ సాయంత్రం కార్యకర్తలతో సమావేశమై కార్యాచరణ నిర్ణయించనున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా, నేడు బీజేపీ నుంచి కాంగ్రెస్​లోకి తిరిగి వెళ్తున్నా తన లక్ష్యం మాత్రమే ఒకటేనని చెప్పారు. కేసీఆర్ కుటుంబం అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. తాను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డానని వెల్లడించారు. కేసీఆర్(CM KCR) నియంత పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్​లోకి తిరిగి వెళ్తున్న తనను ప్రజలంతా ఆదరించాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.

Rajagopal Reddy Clarifies on Party Change : 'కాంగ్రెస్​ నుంచి ఆహ్వానం వస్తున్న మాట నిజమే.. కానీ..'

Rajagopal Reddy Resigns To BJP :కేసీఆర్ కుటుంబపాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం.. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నట్లు కోమటిరెడ్డి రాజ్​గోపాల్​ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని.. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్​ను భావిస్తున్నారని.. అందుకే తాను కాంగ్రెస్​లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.

"తెలంగాణలో బీఆర్​ఎస్​ పాలనకు చరమగీతం పాడే శక్తి బీజేపీకే ఉందని భావించి.. 15 నెలల క్రితం కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరాను. గత ఏడాది జరిగిన మునుగోడు ఉపఎన్నికలో బీజీపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్​ను ఓడించినంత పని చేశాను. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్.. భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అయినప్పటికీ ఆ ఎన్నికలో తనపై బీఆర్​ఎస్​ స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది." - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే

Rajagopal Reddy Comments on BRS Govt :కేసీఆర్ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలందరూ విశ్వసించారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కానీ వారి కోరిక నెరవేరకపోవడమే గాక.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయని తెలిపారు. బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేక పోవడంతో.. ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుని కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

'18లక్షల ఎకరాల భూములను కాజేయాలని కేసీఆర్​ కుటుంబం కుట్ర పన్నుతోంది'

Rajagopal Reddy Fire On Revanth : 'ఒక లక్ష్యం కోసం బీజేపీలో చేరాను.. పార్టీని వీడే ప్రసక్తే లేదు'

Last Updated : Oct 25, 2023, 1:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details