తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

rainfall in nalgonda district
ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు

By

Published : Jun 12, 2020, 4:36 PM IST

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అత్యధిక మండలాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మండలాల వారీగా చూస్తే... గుండాలలో 7.5, వలిగొండలో 5.9, మోత్కూరులో 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలంలో 5.6, తిరుమలగిరిలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.

ఇదీ చూడండి:డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

ABOUT THE AUTHOR

...view details