రాచకొండ గుట్టల్లో జలపాతాల అందాలు కనువిందు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో... దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల్లో నుంచి జలపాతాలు జాలువారుతున్నాయి. దీనివల్ల సంస్థాన్ నారాయణపురం మండల శివారు ప్రాంతాల్లో... ప్రకృతి రమణీయత తాండవిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాటర్ ఫాల్స్ పొంగిపొర్లుతోంది. జలపాతాల సోయగాల్ని వీక్షించేందుకు... పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
అబ్బురపరిచే సోయగాలు.. పరవళ్లు తోక్కుతున్న జలపాతాలు - Rachakonda Waterfalls
చుట్టూ ఎత్తైన కొండలు, గుట్టలు వర్షాకాలం వచ్చిందంటే చాలు దారిపొడవునా పర్చుకున్న పచ్చదనం, పక్షుల కిలకిలారాగాలు, పచ్చని పంటపొలాలు. వాటి మధ్య తాటి చెట్లతో సుందర దృశ్యాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు. ప్రకృతి అందాలకే కేర్ ఆఫ్ అడ్రస్‌గా రాచకొండ వాటర్ ఫాల్స్ నిలుస్తోంది.
అబ్బురపరిచే సోయగాలు.. పరవళ్లు తోక్కుతున్న జలపాతాలు