నల్గొండ జిల్లా పెద్దపూర మండలం చలకుర్తి గ్రామంలో కొండచిలువ హల్చల్ చేసింది. స్థానిక బత్తాయి తోటలో ఓ రైతు కుందేళ్ల పెంపకం చేస్తున్నారు. ఆ కుందేళ్ల పెట్టెలోకి చొరబడ్డ 25 అడుగుల కొండచిలువ.. ఐదు కుందేళ్లను మింగేసింది.
కుందేళ్ల పెట్టెలోకి దూరిన 25 అడుగుల కొండచిలువ - చలకుర్తిలో కొండచిలువ వార్తలు తాజా
కుందేళ్ల పెట్టెలోకి దూరి ఐదు కుందేళ్లను కొండచిలువ మింగేసిన ఘటన నల్గొండ జిల్లా పెద్దపూర మండలం చలకుర్తి గ్రామంలో జరిగింది.

కుందేళ్ల పెట్టెలోకి దూరిన 25 అడుగుల కొండచిలువ
విషయం తెలుసుకున్న రైతు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా.. వాళ్లు వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. పామును సాగర్ అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.