గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్మించిన 6 పబ్లిక్ టాయిలెట్లను ఎమ్మెల్యే భాస్కర రావు ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో 60 నుంచి 70 టాయిలెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపడటానికే ఈ మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
'గాంధీ కన్న స్వచ్ఛ భారత్ కలను తెలంగాణ సర్కార్ నెరవేరుస్తోంది' - miryalaguda mla bhaskar rao
స్వచ్ఛ భారత్‌పై గాంధీ కన్న కలలను తెలంగాణ సర్కార్ నెరవేరుస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు అన్నారు. పురపాలక మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని అన్ని మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్లను ప్రారంభించామని తెలిపారు.
మిర్యాలగూడలో పబ్లిక్ టాయిలెట్లు ప్రారంభం
పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు అన్ని మున్సిపాలిటీల్లో సామాజిక మరుగుదొడ్లు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే భాస్కర రావు తెలిపారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.