తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలు లాక్​డౌన్​కు సహకరించాలి : మంత్రి జగదీశ్​ రెడ్డి

ప్రజలు మరికొద్ది రోజులు లాక్​డౌన్​కు సహకరించాలని మంత్రి జగదీశ్​ రెడ్డి కోరారు. నల్గొండ పట్టణంలోని కంటైన్​మెంట్​ జోన్లను ఆయన పరిశీలించారు. ప్రజలను అడిగి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు.

ప్రజలు లాక్​డౌన్​కు సహకరించాలి : మంత్రి జగదీశ్​ రెడ్డి
ప్రజలు లాక్​డౌన్​కు సహకరించాలి : మంత్రి జగదీశ్​ రెడ్డి

By

Published : May 2, 2020, 1:18 PM IST

నల్గొండ పట్టణంలోని కంటైన్​మెంట్​ జోన్లలో రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్​, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్​తో కలిసి మంత్రి జగదీశ్ ​రెడ్డి పర్యటించారు. జిల్లాలో 16 రోజుల నుంచి ఒక్క కరోనా పాజిటివ్​ కేసు నమోదు కాలేదని మంత్రి తెలిపారు. ఇలాగే కొద్ది రోజులు ఉంటే నల్గొండ జిల్లా కరోనా రహిత జిల్లాగా మారుతుందన్నారు.

మరికొద్ది రోజులు ప్రజలు లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. ప్రతిపక్షాలు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నాయన్నారు. కరోనా పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదనే వాళ్లు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మాట్లాడాలని చెప్పారు. వాళ్లకే గానీ, వాళ్లకి తెలిసిన వ్యక్తులకు గానీ పరీక్షలు చేయలేదనే అనుమానం ఉంటే... తమకు సమాచారమిస్తే తామే దగ్గరుండి పరీక్షలు చేయిస్తామని మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు.

ఇవీ చూడండి:మే17 వరకు లాక్​డౌన్​.. రాష్ట్రప్రభుత్వ వైఖరిపై ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details