తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతదేహాలతో ఆందోళన...

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్​- విజయవాడ జాతీయ రహదారి. రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. ఎంతో మంది విగతజీవులవుతున్నారు. ప్రమాదాలు తగ్గించి ప్రజలను రక్షించే మార్గమేదీ...?

బాధిత కుటుంబాలను ఆదుకొండి

By

Published : Feb 13, 2019, 8:39 PM IST

బాధిత కుటుంబాలను ఆదుకొండి
నల్గొండ జిల్లా నకిరేకల్​ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల బంధువులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుంటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ.. మృతదేహాలతో ఆందోళనకు దిగారు.
మంగళవారం నకిరేకల్​లో ద్విచక్ర వాహనాన్ని హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న చందుపట్లకు చెందిన నగేష్, గోపాల్ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు, స్థానికులు సుమారు గంట సేపు రాస్తారోకో చేయటంతో... రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details