తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ అన్నదాతల ధర్నా - ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలంటూ ధర్నా

పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి 15-20 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభించలేదంటూ నల్గొండ జిల్లా అన్నారం వద్ద రైతులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్​ నాయకులతో కలిసి బైఠాయించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్​ చేశారు.

protest by farmers  to open grain buying centres at nalgonda
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ అన్నదాతల ధర్నా

By

Published : Oct 16, 2020, 3:30 PM IST

నల్గొండ జిల్లా రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఒకవైపు వర్షాలతో మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఉన్న పలు ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తడిసిపోయింది. తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15-20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మాత్రం ప్రారంభించకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు.

శుక్రవారం జి.అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్​ను ప్రారంభించాలంటూ కాంగ్రెస్​ నాయకులతో కలిసి రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్​ చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళనను విరమించారు.

ఇదీ చూడండి:భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం

ABOUT THE AUTHOR

...view details