నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పాత బస్టాండ్ వద్ద దుకాణం కూల్చివేతను డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పాత బస్టాండ్లో సులభ్కాంప్లెక్స్ ఉన్నా... మరొక సులభ్కాంప్లెక్స్ పేరుతో దుకాణాలను కూల్చి వేస్తున్నారని.. దాన్ని అడ్డుకోవాలని చూసిన కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తూ ఆందోళన - latest news of nalgonda
కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ మిర్యాలగూడలో నిరసన చేపట్టారు.
దుకాణం కూల్చివేత.. కాంగ్రెస్ నాయకులు అరెస్టులకు నిరసన
ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇప్పుడు కావాలని షాపు కూల్చడం వల్ల వారు రోడ్డు మీద పడ్డారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే వారిని పోలీసులు అరెస్టు చేయడం తగదని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:కన్నా.. బెంగ వద్దురా అనడమే అసలైన మందు.!