kaanthi Pharma Company Construction At Ghattuppal ఈఅప్పుడు ఫ్లోరోసిస్ .. ఇప్పుడు ఫార్మా కంపెనీలు.. మునుగోడు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి Protest against Kaanthi Pharma Lab Ghattuppal : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల పరిధిలోకాంతీ ఫార్మా'కిష్టాపురంలో తలపెట్టిన మరో ఔషధ సంస్థ వద్దంటూ స్థానికులు కోరుతున్నారు. రైతులు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు సంఘటితమై ఆందోళనలకు సమాయత్తవుతున్నారు. గతంలో ఫ్లోరైడ్ (Fluoride Effect Nalgonda) రక్కసితో అల్లాడిన తమకు ప్రస్తుతం ఫార్మా భూతం వెంటాడుతోందని వాపోతున్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే.. అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని జనం ఆరోపిస్తున్నారు.
"కాంతి ఫార్మ కంపెనీ వల్ల మా భూగర్భజలాలు కలుషితమవుతాయి. ఇక్కడ పెట్టకూడదని ధర్నాలు చేసినా వినిపించుకోకుండా నిర్మిస్తున్నారు. ఎలా నిర్మిస్తారు అని అడిగితే కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెబుతున్నారు. ఎంత గొడవ చేస్తున్నా నిర్మాణ పనులు మొదలుపెట్టారు. దీనివల్ల నీళ్లు, పొలాలు అన్ని నాశనం అవుతాయి." - స్థానికులు
Aurobindo Pharma Gas Leakage : అరబిందో కంపెనీలో గ్యాస్ లీక్.. ఐదుగురి అస్వస్థత
Ghattuppal Villagers Demand to Cancel Kaanthi Pharma Lab : ప్రభుత్వం సారవంతమైన భూముల్లోఫార్మా కంపెనీలుఏర్పాటు చేసి.. తమ పొట్ట కొట్టొద్దంటూ పరిసర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఒక్క ఔషధ సంస్థ వల్ల 17 కిలోమీటర్ల మేర వాతావరణం కాలుష్యం అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే భూముల్లో కాకుండా... ముచ్చర్ల ఔషధ నగరిలో ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
"ఈ కంపెనీ వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఈ కంపెనీ ఇక్కడ నిర్మించడం వల్ల నీరు, భూమి, గాలి అని కాలుష్యానికి గురవుతాయి. కోర్టు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని రైతులంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం. వారు ఇచ్చే పరిహారం కూడా మాకు వద్దు. మా ప్రాంతమంతా విషపూరితమవుతుంది ఈ కంపెనీతో. మా ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. మమ్మల్ని బతకనివ్వకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీని ఇక్కడ నిర్మించకుండా చూస్తాం." - స్థానికులు
Kaanthi Pharma Lab Ghattupall :అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గంలో..ఫార్మా కంపెనీల ఏర్పాటు జనానికి మరోకుంపటిలా మారే ప్రమాదముందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాటి నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. మూగజీవాలు, పశుపక్ష్యాదుల జీవనం కష్టతరంగా మారనుంది. ఇప్పటికే చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన కంపెనీల వలన అక్కడి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఫార్మా కంపెనీల నిర్మాణాలు నిలిపివేయకపోతే.. తమ పోరాటం ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయేతర భూముల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి తమకు ముప్పు తప్పించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
sahiti Pharma: అచ్యుతాపురం సెజ్ పేలుడులో ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
Villagers protest against pharma company : 'మాకు పర్యావరణమే ముద్దు.. ఫార్మా కంపెనీ వద్దు'
Villagers protest on MSN Pharma Company : 'మా సమస్యలు పరిష్కారం కావాలే'.. ఫార్మా కంపెనీ ముందు గ్రామస్థుల ఆందోళన