రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ ఆరోపించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, యువజన విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పట్టభద్రులతో మాట-ముచ్చట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
2013- 14 సంవత్సరంలో రాష్ట్రంలో నిరుద్యోగుల శాతం 2.5 శాతం ఉండగా... ప్రస్తుతం అది 8.5 శాతానికి చేరుకుందని కోదండరామ్ తెలిపారు. కొవిడ్ కారణంగా అన్ని రకాల వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. నిరుద్యోగం మరింత పెరిగిందని పేర్కొన్నారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని... వాటికి కనీసం మద్దతు ధర కల్పించలేకపోయారని ఆరోపించారు.