తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: శ్రీధర్​రెడ్డి - నల్గొండ జిల్లా తాజా వార్తలు

నల్గొండ జిల్లా నాంపల్లిలో చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. వీరికి మద్దతుగా భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్​రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

Problems of handloom workers must be solved: Sridhar Reddy
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: శ్రీధర్​రెడ్డి

By

Published : Aug 30, 2020, 1:19 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ నల్గొండ జిల్లా నాంపల్లిలో చేనేత కార్మికులు గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరికి మద్దతుగా భాజపా నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్​రెడ్డి దీక్షలో పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మికులు గత కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని శ్రీధర్​రెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోవైపు కరోనా కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. వాటిని ఖర్చు చేయకుండా పక్కకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చూడండి: బ్యాంకును మోసం చేశారంటూ సర్వోమ్యాక్స్​పై సీబీఐలో కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details