నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసు ఠాణా నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. సూర్యాపేటకు చెందిన నరందాసు మణికంఠ అనే నిందితుడు పోలీసుల కళ్లు గప్పి ఉడాయించాడు.
పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరార్ - ఖైదీ పరారీ
పోలీసు కళ్లు గప్పి ఓ రిమాండ్ ఖైదీ పరారైన ఉదంతం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఒకటో ఠాణా పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది.
పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరార్
మోటారుసైకిళ్ల చోరీ కేసులో గత నెల 29న పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. అయితే విచారణ నిమిత్తం పోలీసులు... నిందితుణ్ని మిర్యాలగూడ సబ్ జైలు నుంచి ఈ నెల 7న ఒకటో పట్టణ ఠాణాకు తరలించారు. రెండ్రోజుల కస్టడీ అనంతరం అప్పగించాల్సి ఉండగా... సోమవారం తెల్లవారుజామున సంకెళ్లు తెంచుకుని పరారైనట్లు పోలీసు అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి: దిశ హత్య కేసు: నిందితుల్లో ఇద్దరు మైనర్లు?