నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పందిర్లపల్లి చెరువులోని మట్టిని ఇటుక బట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఐదు జేసీబీలతో 100 ట్రాక్టర్లతో మట్టిని గత మూడు రోజుల నుంచి తరలిస్తున్నారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఇద్దరు ఇటుక బట్టీల వ్యాపారులు మైనింగ్ శాఖ ద్వారా చెరువులో మట్టి తరలింపునకు అనుమతి పొందామని చెబుతూ మట్టిని తరలిస్తున్నారు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఇరిగేషన్ అధికారిని వచ్చి హడావుడి చేశారు. మట్టిని తీసిన ప్రాంతంలోనే హద్దులు నిర్ణయిస్తామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇష్టారాజ్యంగా చెరువు మట్టి తరలింపు
చెరువు మట్టిని రైతులు పొలాల్లో వేసుకుంటామంటే అనుమతి ఇవ్వని అధికారులు ఇటుక బట్టి వ్యాపారులకు మాత్రం రాచబాట వేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పందిర్లపల్లి చెరువులో ఇటుక బట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా చెరువు మట్టి తరలింపు
ఇదీ చదవండి:Corona: చికిత్సనందిస్తూనే మృత్యుఒడికి!