నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో పార్లమెంట్ ఎన్నికల సామగ్రిని నిర్మల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి తరలిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పయనమవుతున్నారు. జిల్లా పాలనాధికారి గౌరవ్ ఉప్పల్ ప్రక్రియను పరిశీలించారు. దాదాపు 293 కేంద్రాల్లో 2000 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారు.
30 కేంద్రాలు సీసీ కెమెరాలతో నిఘా