నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో... నిబంధనల అతిక్రమణదారులపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 259 కేసులు నమోదు చేయగా... మూడు జిల్లాల పరిధిలో 3 వేల 117 ద్విచక్ర వాహనాల్ని సీజ్ చేశారు. మరో రెండు వందల కార్లు, ఆటోల్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో 14 వందల 80 వాహనాలకు గాను 30 లక్షల 26 వేలు... సూర్యాపేట జిల్లాలో 14 వందల 13 వాహనాలకు 14 లక్షల 80 వేలు రూపాయలు జరిమానా వేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జిల్లాలో 224 ద్విచక్ర వాహనాలపై 12 లక్షల 75 వేల జరిమానా రాబట్టారు. మొత్తంగా మూడు జిల్లాల పరిధిలో 58 లక్షల వరకు జరిమానా రూపంలో వసూలు చేశారు. మోటరు వాహన చట్టం కింద సూర్యాపేట జిల్లాలో 15 వందల 69... యాదాద్రి జిల్లాలో 3 వేల 723 కేసులు నమోదయ్యాయి.
నగదు సాయం రూ.1500 !
జన్ ధన్ ఖాతాలతో పాటు తెల్ల కార్డు ఉన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1500ను చెల్లించింది. వాటిని తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఫలితంగా అన్ని బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంటోంది. భౌతిక దూరం పాటించకపోవడం... మాస్కులు ధరించని తీరుపై వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు చేస్తోంది.