తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యం పట్టివేత

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీ, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని... ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

police Seized of illegally moving 78 quintals PDS rice in miryalaguda
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యం పట్టివేత

By

Published : Jan 21, 2021, 4:51 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 78 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని... పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. పలు గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని కొంతమంది వాహనాల్లో తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు చేశారు.

బియ్యాన్ని తరలిస్తున్న ఒక లారీ, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:'కులాల తొలగింపుపై నివేదిక కోరిన జాతీయ బీసీ కమిషన్'

ABOUT THE AUTHOR

...view details