అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్పోస్ట్ వద్ద సాధారణ స్థితి నెలకొని ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారుల పేర్లను పోలీసులు నమోదు చేసుకుంటున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. హోం క్యారంటైన్ ముద్రలు వేసి పంపిస్తున్నారు.
వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భద్రతా చర్యలు - వాడపల్లి చెక్పోస్ట్ తాజా వార్తలు
అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో నల్గొండ జిల్లా వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి లోనికి అనుమతిస్తున్నారు.
![వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భద్రతా చర్యలు Police security measures at Vadapalli check post in nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7427161-143-7427161-1590991308484.jpg)
వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భద్రతా చర్యలు