నల్గొండ జిల్లా చండూర్ మండలం శిర్ధేపల్లి గ్రామంలో జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు పాల్పడిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్(Police lathicharge) చేశారు. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆదివారం రాత్రి గణనాథుడి శోభాయాత్ర(ganesh immersion) నిర్వహిస్తుండగా ఒక వర్గం వారు డీజే సౌండ్ బాక్సులు పెట్టారు. అదే సమయంలో మరో వర్గం వారు అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం ఇరువర్గాల వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Police lathicharge: పోలీసుల లాఠీ ఛార్జ్ .. స్టేషన్ ముందు గ్రామస్థుల ధర్నా - నల్గొండ జిల్లా వార్తలు
వినాయక నిమజ్జనంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసులు(Police lathicharge) వైఖరిపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమను అన్యాయంగా కొట్టారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్(chandur police station) ముందు బైఠాయించారు. నల్గొండ జిల్లా చండూర్ మండలం శిర్దేపల్లిలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది.
![Police lathicharge: పోలీసుల లాఠీ ఛార్జ్ .. స్టేషన్ ముందు గ్రామస్థుల ధర్నా Police laticharge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13128335-1063-13128335-1632221244654.jpg)
దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. గొడవపై ఎలాంటి విచారణ చేయకుండానే అక్కడ ఉన్న వారిని చితక బాదారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గొడవకు ప్రేరేపించిన వారిని కాకుండా అమాయకులను కొట్టారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో చండూర్ స్టేషన్ ముందు గ్రామస్థులు ధర్నాకు దిగారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకున్న మరో వర్గం వారి డీజేకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే సీఐ చొరవ తీసుకోవడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత... తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ