తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్​కు మొదలైన పర్యాటకుల తాకిడి..!

నాగార్జునసాగర్​కు ​పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. లాక్​డౌన్​తో ఇన్నిరోజులు ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి కాసేపు సరదాగా గడుపుతున్నారు. ఆహ్లాదకర వాతావరణం కోసం జలపాతాలు, జలాశయాలకు పయనమవుతున్నారు.

నాగార్జునసాగర్​కు మొదలైన పర్యాటకుల తాకిడి..!
నాగార్జునసాగర్​కు మొదలైన పర్యాటకుల తాకిడి..!

By

Published : Jun 27, 2021, 4:35 PM IST

నాగార్జునసాగర్​లో పర్యాటకుల సందడి ఊపందుకుంది. డౌన్​పార్క్ వద్ద ఉన్న లాంచీ స్టేషన్ నుంచి పర్యాటకుల కోసం జాలీ ట్రిప్పులను తిప్పుతున్నారు. సాగర్ నుంచి నాగార్జున కొండకు లాంచీ ప్రయాణానికి అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల జాలీ ట్రిప్పులను మాత్రమే నడుపుతున్నట్లు లాంచీ స్టేషన్ మేనేజర్ తెలిపారు.

లాంచీ జాలీ ట్రిప్పుల టిక్కెట్ ధరలు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.120గా తీసుకుంటున్నారు. పర్యాటకుల రాక ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో పర్యాటకశాఖ సమాయత్తం అవుతోంది.

లాక్​డౌన్​తో ఇన్నిరోజులు ఇళ్లకే పరిమితమయ్యాం. బయటకు వస్తే కాస్త ఉపశమనం కలుగుతుందని కుటుంబంతో కలిసి నాగార్జునసాగర్​కు​ వచ్చాం. చాలా రోజుల తర్వాత లాంచీ ప్రయాణం సంతోషాన్నిచ్చింది.-ఖాదర్​, పర్యాటకుడు

మరోవైపు నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 533 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 176 టీఎంసీలుగా ఉంది.

నాగార్జునసాగర్​కు మొదలైన పర్యాటకుల తాకిడి..!

Telangana Weather Report: రానున్న మూడు రోజులు వర్షాలు...

ABOUT THE AUTHOR

...view details