కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభింస్తోన్న తరుణంలో మాస్క్ లేకుండా తిరుగుతున్న ప్రజలకు, వాహనదారులకు పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ జరిమానా విధిస్తున్నారు.
కరోనాపై అవగాహన.. మాస్కు లేకుంటే జరిమానా - latest news of police fined people
కరోనా వైరస్‌పై ఎంత మంది ఎన్ని చెప్పిన వాటిని బేఖాతరు చేస్తూ ప్రజలు, వాహనదారులు మాస్కులు లేకుండా తిరుగుతున్నారని నల్గొండ జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ వారికి జరిమానా విధిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వారికి వైరస్పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో నాగార్జునసాగర్, త్రిపురారం పోలీసులు మాస్కు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్న వాళ్లకు రూ.1000 జరిమానా విధిస్తున్నారు. అంతే కాకుండా అధిక మందిని ఎక్కించుకుని వెళ్తున్న ఆటోలను సీజ్ చేస్తూ అందులో ప్రయాణిస్తున్న వారికి కరోనాపై అవగాహన కలిపిస్తున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని.. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని పోలీసులు ప్రజలకు అవగాహన కలిపిస్తున్నారు.
ఇదీ చూడండి:ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..