నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో ప్రజలు లాక్డౌన్ను పాటించడం లేదు. గ్రామంలోని చెరువు వద్దకు ప్రజలు చేపల కోసం వందల సంఖ్యలో చేరుకున్నారు.
చేపల కోసం ఎగబడ్డ జనం..చెరువు వద్ద గుంపులు గుంపులు - చెరువు వద్ద గుమిగూడిన ప్రజలు
లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరిని బయటకు రావొద్దని సూచించారు. అయినప్పటికీ నల్లగొండ జిల్లా కిష్టాపురం గ్రామంలో ప్రజలు విచ్చలవిడిగా బయటకు వచ్చి నిబంధనలను పాటించకుండా చేపలకోసం ఎగబడ్డారు. భౌతిక దూరాన్ని పాటించకుండా కొనుగోలు చేశారు.

ఆ గ్రామంలో ప్రజలు చెరువు వద్ద గుమిగూడారు
భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించి గుమిగూడారు. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు చోట్ల ఇలా రద్దీగా చేరి భయాందోళనకు గురిచేస్తున్నారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు