నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పాత వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మాంసం విక్రయ కేంద్రానికి ప్రజలు పోటెత్తారు. ఆదివారం కావటం వల్ల చేపలు, మటన్ కొనేందుకు దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. చేపలు, మటన్ విక్రయించడానికి అదికారులు విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేసినప్పటికీ, వినియోగదారులు భౌతికదూరం మరిచి గుంపులుగా గుమిగూడారు.
నిబంధనలకు నీళ్లు... మాంసం కొరకు గుంపులు - telangana lock down upadates
కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మాంసం విక్రయకేంద్రాల వద్ద ప్రజలు నిబంధనలు పాటించకుండా... గుంపులుగా గుమిగూడుతున్నారు.
నిబంధనలకు నీళ్లు... మాంసం కొరకు గుంపులు
మిర్యాలగూడలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు మాత్రం నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని పలువురు వాపోతున్నారు.