నాగార్జునసాగర్ హిల్‌కాలనీ 6వ వార్డులో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన తెరాస నాయకులను కాలనీ వాసులు నిలదీశారు. తమకు తాగు నీరు అందడం లేదని తెలిపారు. ఓటు కోసం ఒక్కరోజు తమ చుట్టు తిరిగి ఐదు సంవత్సరాలు నాయకులు చుట్టు తిప్పించుకుంటారని అన్నారు.
ప్రచారానికెళ్లిన తెరాస నేతలకు చేదు అనుభవం - తెలంగాణ తాజా వార్తలు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో హిల్‌కాలనీలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన తెరాస నేతలకు చేదు అనుభవం ఎదురైంది. తమకు తాగు నీరు రావడం లేదని కాలనీ వాసులు నిలదీశారు.
నాగార్జునసాగర్
తెరాస నాయకులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు వినలేదు. చేసేది ఏమి లేక నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:సాగర్ ఉపఎన్నిక బరిలో 41మంది అభ్యర్థులు