పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో తెరాస, భాజపాకు ప్రజలు బుద్ధి చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సాగర్ ఉపపోరులో 50 వేల మెజార్టీతో జానారెడ్డి గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా హాలియాలో ఉత్తమ్, జానారెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఈనెల 14న జరగనున్న ఎన్నికల్లో రాములు నాయక్‌ను గెలిపించాలని ఉత్తమ్, జానా విజ్ఞప్తి చేశారు.
నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కేసీఆర్‌దే: ఉత్తమ్ - పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాసపై విమర్శలు
నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా హాలియా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కేసీఆర్‌దే: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా గిరిజనులకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చిందా అని ప్రశ్నించారు. ఆరేళ్లు ఎమ్మెల్సీగా ఉన్నపల్లా రాజేశ్వర్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చి.. వాటితో ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నం చేశారని ఆరోపంచారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ గిరిజన నాయకుడు బెల్లయ్య నాయక్, జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.