నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. గిరిజన బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు రాములు నాయక్‌ను గెలిపించాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీని కేసీఆర్ ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పారు.
నిరుద్యోగ భృతి ఏమైంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి - నల్గొండ జిల్లా లేటెస్ట్ వార్తలు
నిరుద్యోగ భృతి ఇస్తానన్న హామీని కేసీఆర్ ఇంతవరకు నెరవేర్చలేదని పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
![నిరుద్యోగ భృతి ఏమైంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి pcc chief, nalgonda mp uttam kumar reddy mlc campaign in nalgonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10898975-thumbnail-3x2-uttam.jpg)
నిరుద్యోగ భృతి ఏమైంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేసీఆర్ వాగ్దానం చేసిన నాటి నుంచి నేటి వరకు నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన 70 వేల తొమ్మిది రూపాయలను వారి ఖాతాలో జమ చేసిన తర్వాతే ఎమ్మెల్సీ ఓట్లు అడగాలన్నారు. ఇక్కడ పోటీ కాంగ్రెస్, తెరాస అభ్యర్థికి మాత్రమేనని.. కోదండరాం, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే ఫలితం లేకుండా పోతుందని చెప్పారు.
నిరుద్యోగ భృతి ఏమైంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి