తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. ఆర్టీసీ నష్టాల్లోనే.! - నల్గొండలో బస్సులకు డీజిల్‌ ఖర్చులు రావడం లేదంటున్న అధికారులు

ఊర్లలో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు.. ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఒక పక్క కరోనా, మరో పక్క ఎండ తీవ్రత బాగా పెరగడం వల్ల ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు ఆసక్తి చూపడంలేదు. నల్గొండ జిల్లాలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది.

Passengers available despite the availability of public transport In Nalgonda
ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. ఆర్టీసీ నష్టాల్లోనే.!

By

Published : May 31, 2020, 12:50 PM IST

కరోనా నేపథ్యంలో... ఉమ్మడి నల్గొండ జిల్లాలో బస్సులు 58 రోజులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ప్రజారవాణా అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రయాణికులు లేక బస్సులు వెలవెలబోతున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా రూ.కోట్లు కోల్పోయిన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాట పట్టిందనుకునే సమయంలో కరోనాతో బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి.

గతంలో రోజుకు రూ.కోటి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజూ 750 బస్సులు నడిచేవి. వీటి ద్వారా నిత్యం 2.50 లక్షల నుంచి 3 లక్షల ప్రయాణికులు గమ్యానికి చేరేవారు. లాక్‌డౌన్‌కు ముందు ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీకి రూ.కోటి నుంచి రూ.1.5 కోట్లు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌ తర్వాత రోజుకు రూ.29 లక్షల ఆదాయం మాత్రమే సమకూరుతోంది.

డీజిల్‌ ఖర్చులు రావడం లేదు

ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా ఆర్టీసీ నష్టాల్లోనే సాగుతోంది. ప్రస్తుతం వస్తున్న ఆదాయం డీజిల్‌ ఖర్చులకు సరిపోవడం లేదని అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటం వల్ల ఉదయం 10 దాటితే ప్రయాణికులు ఉండడంలేదు.

"రోజూ బస్సులు డిపోలకు చేరుకోగానే సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేస్తున్నాం. డ్రైవరు, కండక్టరు వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నాం. మాస్కు ఉంటేనే ప్రయాణికులకు బస్సులోకి అనుమతిస్తున్నాం. ప్రధాన నగరాలకు రాత్రిళ్లు బస్సులు అందుబాటులో ఉంటున్నాయి"

-వెంకన్న, ఆర్‌ఎం, నల్గొండ

ఇదీ చూడండి:భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా

ABOUT THE AUTHOR

...view details