నాగార్జున సాగర్‌లో.. ఓయూ విద్యార్థి నేత, కాంగ్రెస్ నాయకుడు మానవతా రాయ్‌ను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి హింసించారని పార్టీ నేతలు మండిపడ్డారు. ఘటనపై విచారణ చేపట్టాలంటూ.. డీజీపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అలాగే ఇటీవల ఉద్యోగాల భర్తీని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సునీల్ కుమార్ నాయక్ వీడియోను వాంగ్మూలంగా అంగీకరించి.. సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
'మానవతా రాయ్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారు' - నాగార్జున సాగర్
నాగార్జున సాగర్‌లో.. కాంగ్రెస్ నాయకుడు మానవతా రాయ్ అరెస్ట్‌ను పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని ఆశ్రయించారు.
మానవతా రాయ్ అరెస్ట్