తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2020, 6:24 PM IST

ETV Bharat / state

ప్రకృతి వనాలతో.. పల్లెలకు కొత్త కళ

గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచేలా ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలతో పల్లెలు కొత్త అందాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో రకరకాల మొక్కలు నాటి పార్కులు ఏర్పాటు చేసి.. పల్లెల్లో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో ముందుండి అధికారుల ప్రశంసలందుకుంటున్నది.

Palle Prakruthi Vanam Construction Works Speedup In Munugodu mandal In Nalgonda District
పకృతి వనాలతో.. పల్లెలకు నూతన శోభ

గ్రామాల్లో పచ్చదనాన్ని మరింత పెంచుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పార్కుల ఏర్పాటుకై.. నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాల నిర్మాణ పనులు నల్గొండ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీతో పాటు వాటి పరిధిలో ఉన్న ఆవాస గ్రామాల్లో సైతం ప్రభుత్వ స్థలాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు పల్లె ప్రకృతి వనాల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

పనితీరులో మునుగోడు ముందంజ..
నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో తహశీల్దార్ దేశ్యానాయక్ ఒక్కొక్క గ్రామానికి ఎకరం, అరఎకరం, కొన్ని గ్రామాల్లో రెండెకరాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు గానూ.. భూములను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ స్థలంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్​లు, గ్రామస్తులు, అధికారులు మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

దాతృత్వం చాటిన దాతలు..
మునుగోడు మండలంలోని జక్కలివారిగూడెం గ్రామంలో తహశీల్దార్ ప్రత్యేక చొరవతో కీర్తిశేషులు వెదుల్ల వెంకటకృష్ణ జ్ఞాపకర్థం వారి కుటుంబ సభ్యులు 20 గుంటల పట్టా భూమిని పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ఉచితంగా ఇచ్చారు.


అధికారుల నుండి ప్రశంసలు..
మునుగోడు మండలంలోని పలు గ్రామాలకు జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షించి రావిగూడెం, పులిపలుపల, గుడార్ గ్రామాల పనితీరును ప్రశంసించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరులో మునుగోడు మండలం ముందంజలో ఉందని చుట్టుపక్కల మండలాల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు మునుగోడు మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కొని గ్రామాల్లోని సర్పంచ్​లు ప్రభుత్వం ఇచ్చిన మొక్కలే కాకుండా వారు వ్యక్తిగత పెట్టుబడితో ప్రకృతి వనాలకు అందాన్ని తెచ్చే.. వివిధ ఆకర్షణీయమైన మొక్కలను నాటి.. పల్లెలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు.

ఇదీ చూడండి:వరుస ఎన్నికలపై కారు నజర్‌.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ

ABOUT THE AUTHOR

...view details