తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాతకు తప్పని అవస్థలు.. ధాన్యం కాపాడుకోవడానికి నానాతంటాలు - యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Paddy procurement problems in Nalgonda: ఆరుగాలం కష్టపడి పంటను కాపాడుకుంటూ వచ్చిన అన్నదాత.. చేతికి వచ్చిన ధాన్యం అమ్ముకోవడానికి నానాతంటాలు పడుతున్నాడు. ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలతో ఇప్పటికే సగం పంట నష్టపోయిన రైతు.. మిగిలిన పంటను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అవంతిపురం వ్యవసాయ మార్కెట్​లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నా.. కొనడానికి కన్నెత్తి చూడని అధికారుల తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

farmers
farmers

By

Published : Apr 8, 2023, 2:40 PM IST

Paddy procurement problems in Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం వ్యవసాయ మార్కెట్​లో ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. గత పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు కోసం ఎదురుచూస్తున్నా వారికి నిరాశే మిగులుతోంది. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

"మొత్తం పది ఎకరాల ధాన్యం.. రోజు అరబెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. సాయంత్రం వేళ వర్షం వస్తే అప్పటికప్పుడు కూలీలు పెట్టి ధాన్యం సేకరణ చేస్తున్నాం. మరల ఉదయం వాటిని ఆరబెడుతున్నాం. ఇలా కూలీలకు వేతనాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ అందుబాటులో పట్టాలు కూడా లేవు.. మా దగ్గర ఉన్న పట్టాలతో కప్పిన ఈదురు గాలులకు అవి ఎగిరి వర్షంతో తడిచిపోతున్నాయి. ఏ ఒక్క అధికారి ధాన్యం కొనుగోలు చేయడానికి రావడం లేదు". - కేతావత్ సైదా రైతు, మిర్యాలగూడ

ఆరుగాలం కష్టపడి పండించడానికి నానా అవస్థలు పడ్డ రైతులు.. తీరా పంట చేతికందాక దాన్ని అమ్ముకోవడానికి పడరాన్ని పాట్లు పడాల్సి వస్తోంది. ధాన్యంపై ఉంచిన పరదాలు తీసి ఆరబెట్టడానికి కూలీల ఖర్చుతో పాటు భోజన ఖర్చులు అధికమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. గ్రామాల నుంచి రావడానికి బస్సు చార్జీలు అధికమవువుతున్నాయని.. మార్కెట్​లో కనీసం తాగడానికి మంచి నీరు సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు.

మార్కెట్ యార్డులో కొంతమందికి మాత్రమే ధాన్యం పట్టాలు కప్పడానికి ఇచ్చారని రాత్రివేళ ఆకాల వర్షం వస్తే మిగతా వారి పరిస్థితి ఏంటనీ రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వర్షాలు కురవకముందే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఇటీవల కురిసిన వానలతో పంట నష్టపోయామని.. ఇంకా నష్టపోయే స్థితిలో లేమని వాపోతున్నారు.

"నాలుగు ఎకరాల ధాన్యం రోజు నేను మా ఆవిడ వచ్చి ఆరబెట్టి సాయంత్రం ఇంటికి వెళ్తున్నాం. భోజనం ఖర్చులు, బస్సు ఛార్జీలు అధికమవుతున్నాయి. కప్పడానికి పట్టాలు కూడా ఇక్కడ లేవు.. సడన్​గా వర్షం వస్తే మా పరిస్థితి ఎంటో అర్థం కావడం లేదు.. బాగా ఎండిన ధాన్యం వర్షం వస్తే మొలకలు వస్తాయి. అప్పుడు దేనికి పనికి రాకుండా పోతాయి. అధికారులు ఎవరు ధాన్యం కొనడానికి రావడం లేదు. కనీసం తూకం వేసి బస్తాలలో ఉంచిన బాగుండేది". -కోట్యా రైతు ,తక్కెళ్లపాడు తండా

ఇవీ చదవండి:

'యాసంగి ధాన్యం ఒక్క గింజ వదులుకోం.. ఒక్క రూపాయి పోనివ్వం'

యాసంగి ధాన్య సేక‌ర‌ణ‌కు ఏర్పాట్లు షురూ!

కేంద్రం Vs రాష్ట్ర ప్రభుత్వం.. భగ్గుమంటున్న 'బొగ్గు' వివాదం

ABOUT THE AUTHOR

...view details