భూ వివాదంతో నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం కొలుముంతల్ పహడ్ ఎంపీటీసీ భర్త రాజు నాయక్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గత కొంత కాలంగా ఇరుకుటుంబాల మధ్య వివాదం నడుస్తున్నట్లు తెలిస్తోంది.
భూవివాదంతో ఎంపీటీసీ భర్తపై ప్రత్యర్థుల దాడి - Nalgonda District news
నల్గొండ జిల్లాలో భూవివాదంతో ఎంపీటీసీ భర్తపై ప్రత్యర్థుల దాడికి దిగారు. ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భూవివాదంతో ఎంపీటీసీ భర్తపై ప్రత్యర్థుల దాడి
ప్రత్యర్థులు రాజునాయక్‌పై ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు కాగా... దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడం వల్ల హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించడం జరిగింది. దాడికి పాల్పడ్డ వారు కేశ్యతండాకు చెందిన వారని తెలిపిన... బాధితుని భార్య ఫిర్యాదు మేరకు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భూవివాదంతో ఎంపీటీసీ భర్తపై ప్రత్యర్థుల దాడి
ఇవీ చూడండి:షేక్‌పేట ఘటనలో కొత్త కోణం.. ఏసీబీ అధికారులకే మస్కా..
TAGGED:
Nalgonda District news