తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంతమందొచ్చినా 70 మందికే పరీక్షలు - నల్గొండ జిల్లా తిప్పర్తి పీహెచ్​సీలో కొవిడ్​ కిట్ల కొరత

రాష్ట్రంలో కొవిడ్​ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్నప్పటికీ.. పరీక్షలు మాత్రం అరకొరగానే జరుగుతున్నాయి. కొవిడ్​ పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోజుకు 100 నుంచి 150 మంది వస్తుంటే.... కిట్ల లేమితో రోజుకు 70 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు.

Telangana news
తెలంగాణ వార్తలు

By

Published : May 17, 2021, 5:55 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన ఓ మహిళ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స చేయాలంటే కొవిడ్​ రిపోర్టు తప్పనిసరని వైద్యులు పంపేశారు. టెస్టు చేయించుకుందామని పరీక్ష కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆరోజుతో టెస్టులు అయిపోయాయని చెప్పారు. గత నాలుగు రోజులుగా ఆమె వెళ్తోంది. కిట్లు అయిపోయాయని చెప్పడం వల్ల ఇంటి ముఖం పడుతోంది. ఈలోగా తన ఆరోగ్యం ఏమౌతుందో.. తన వల్ల కుటుంబం ఎంత బాధపడుతుందో తలచుకుంటూ తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. రాష్ట్రంలో కిట్లలేమి వల్ల చేస్తున్న అర కొర పరీక్షలకు ఈ ఘటన ఒక ఉదాహరణ.

నల్గొండ జిల్లా తిప్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిట్ల కొరతతో సగం మందికి కూడా టెస్టులు చేయడం లేదని అనుమానితులు ఆరోపిస్తున్నారు. లక్షణాలు ఉన్నప్పటికీ చికిత్స చేయించుకోలేక.. అటు ఇళ్లకు పోలేక సతమతవుతున్నారు. కిట్ల సంఖ్యను పెంచి పరీక్షలను పెంచాలని కోరుతున్నారు. అటు వైద్యులేమో కిట్లు పరిమితంగా ఉండడం వల్లనే పరీక్షలు తక్కువగా చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమేనా : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details