తెలంగాణ

telangana

ETV Bharat / state

నామినేషన్లకు వరుస సెలవులతో అభ్యర్థుల్లో అయోమయం

నాగార్జునసాగర్ ఉపఎన్నిక అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నెల 23 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ ఇందులో 27, 28, 29 తేదీలను సెలవులుగా నిర్ణయించింది. దీంతో నామపత్రాలు దాఖలు చేసేందుకు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉన్న ఆ 3 రోజుల్లోనూ ఒకే ఒక్క రోజు మంచిగా భావిస్తుండటంతో... ఆ రోజే భారీగా నామపత్రాలు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నామినేషన్లకు వరుస సెలవులతో అభ్యర్థుల్లో అయోమయం
నామినేషన్లకు వరుస సెలవులతో అభ్యర్థుల్లో అయోమయం

By

Published : Mar 25, 2021, 3:57 AM IST

నామినేషన్లకు వరుస సెలవులతో అభ్యర్థుల్లో అయోమయం

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ఈనెల 23న నోటిఫికేషన్ వెలువడింది. అదే రోజు నామినేషన్లు స్వీకరణ ప్రారంభించిన ఎన్నికల సంఘం... ఈ నెల 30 వరకు తుది గడువిచ్చింది. ఈ నెల 29న అయితే బాగుంటుందని అభ్యర్థులు భావించారు. కానీ అందుకు అవకాశం లేకుండా... మొత్తం 8 రోజుల్లో 3 రోజుల్ని సెలవులుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 27న నాలుగో శనివారం, 28 ఆదివారం, 29 హోలీ దృష్ట్యా... వరుసగా సెలవులు వచ్చాయి. తొలి 2 రోజుల్లో 7 నామినేషన్లు దాఖలు కాగా ఇక 3 రోజులు మాత్రమే మిగిలింది.

మిగిలింది 3 రోజులే..

మిగిలిన 3రోజుల్లో కేవలం ఒక్కరోజు మాత్రమే మంచిరోజు ఉంది. 25న ఆశ్లేష నక్షత్రం, 30న మంగళవారం కావడంతో పెద్దగా నామినేషన్లు పడబోవని భావిస్తున్నారు. 26 శుక్రవారం శుభదినంగా భావించి పెద్ద ఎత్తున నామపత్రాల దాఖలుకు ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇప్పటివరకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయగా... ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇంకా నామినేషన్లు వేయాల్సి ఉంది. నామినేషన్‌ తేదీని త్వరలో ప్రకటిస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి వెల్లడించారు.

ఈసీ ప్రకటనతో అయోమయం

ఈసీ ప్రకటనతో ప్రధాన పార్టీల్లో అయోమయం ఏర్పడింది. అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం వల్ల ఉన్న ఒకట్రెండు రోజుల్లోనే నామపత్రాలు దాఖలు చేయాలన్న ఆలోచన కనపడుతోంది. ప్రధాన పార్టీల పరంగా చూస్తే ఇప్పటివరకు... కాంగ్రెస్ తరఫున జానారెడ్డి అభ్యర్థిత్వం మాత్రమే ఖరారు కాగా.. తెరాస, భాజపాతో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉంది.

ఇదీ చదవండి: నేటితో ముగియనున్న శాఖల వారీగా పద్దులపై చర్చ

ABOUT THE AUTHOR

...view details