తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిరేకల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 65.74 శాతం పోలింగ్ - నకిరేకల్‌ పురపాలికలో ఓటింగ్​

నకిరేకల్‌ పురపాలికలో 20 వార్డులకు పోలింగ్​ కొనసాగుతోంది. మొత్తం 21వేల 382 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఉదయం నుంచే ఓటర్లు కొవిడ్​ నిబంధనల నడుమ పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 65.74 శాతం పోలింగ్ నమోదైంది.

Nakrekal nalgonda news, Nakrekal voting news today
నకిరేకల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 65.74 శాతం పోలింగ్

By

Published : Apr 30, 2021, 9:33 AM IST

Updated : Apr 30, 2021, 2:23 PM IST

నల్గొండ జిల్లా నకిరేకల్‌ మున్సిపల్‌లో ఓటింగ్​ కొనసాగుతోంది. ఈ మేరకు 40 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 20 వార్డులకుగాను 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 21వేల 382 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. కరోనా నిబంధనల మధ్య ఓటింగ్​ జరుగుతోంది.

మేజర్ గ్రామ పంచాయితీ నుంచి కొత్తగా ఏర్పడిన నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. నకిరేకల్ సమీపంలోని ఏడు గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేసి 20 వార్డులు ఏర్పాటు చేశారు.

నకిరేకల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 65.74 శాతం రికార్డైంది.

ఇదీ చూడండి:ఖమ్మం కార్పొరేషన్‌లో కొనసాగుతున్న పోలింగ్

Last Updated : Apr 30, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details