నాగార్జునసాగర్(Nagarjuna Sagar) జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. వరద కొనసాగుతుండడం వల్ల శనివారం ఉదయం 2 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16,158 క్యూసెక్కుల నీరు స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నెల 12న సాయంత్రం వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేసిన అధికారులు... ఇవాళ ఉదయం 2 గేట్లను ఎత్తారు. జలాశయం ఇన్‌ఫ్లో 67,647 క్యూసెక్కుల కాగా... అంతేమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద - తెలంగాణ వార్తలు
నాగార్జునసాగర్(Nagarjuna Sagar) జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇవాళ ఉదయం రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది.
సాగర్ కుడి కాలువకు 6,873... ఎడమ కాలువలకు 8,280 క్యూసెక్కుల నీరు, ఏఎమ్మార్పీ కాల్వకు 2400 క్యూసెక్కుల నీరు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,536 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యo 312.04 టీఎంసీలు... ప్రస్తుతం 311.44 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయం నిండుకుండలా మారింది. ఈ క్రమంలోనే మిగతా 24 క్రస్ట్ గేట్ల మీద నుంచి గాలుల వీయడం వల్ల గేట్లపై నుంచి నీరు స్పిల్‌వే మీద దూకుతోంది.
అలాగే పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 36,204 క్యూసెక్కులు ఉండగా... 74,032 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 45.77 టీఎంసీలకు... ప్రస్తుతం 26.52 టీఎంసీల నీరు ఉంది.
- ఇదీ చదవండి:ప్రత్యక్ష బోధన సాధ్యమయ్యేనా?