తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులపై ఉపాధ్యాయుడి కర్కశత్వం - DAADI

పూటుగా తాగొచ్చిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు.. విద్యార్థులను బయటకి తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడో కూడా తెలియని పిల్లలు అతని వెంట వెళ్లారు. అక్కడికెళ్లాక వారిని చితకబాదాడు. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది.

విద్యార్థులపై ఉపాధ్యాయుడి కర్కశత్వం

By

Published : Mar 15, 2019, 5:18 PM IST

విద్యార్థులపై ఉపాధ్యాయుడి కర్కశత్వం
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థుల పాలిట యముడయ్యాడు. తాగిన మైకంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నపిల్లలని కూడా చూడకుండా చితకబాదాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నరేష్, మహేష్, హనుమంతులు మౌంట్ కార్మెల్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ... అక్కడే వసతి గృహంలో ఉంటున్నారు. రాత్రి పది గంటల సమయంలో సలీం అనే టీచర్... తనతో రమ్మని ముగ్గురు విద్యార్థులను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అతనితో పాటు మద్యం సేవించిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి... పిల్లలను చితకబాదారు. కాళ్ల మీద పడి బతిమాలినా వినకుండా కర్రలతో కుళ్లబొడిచారు.

ఇద్దరు నిందితులు పరారీ...

పిల్లల ఆర్తనాదాలు విన్న స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు వచ్చినప్పటికీ... ఇద్దరు నిందితులు పరారయ్యారు. పాఠశాల ఉపాధ్యాయుడు దొరికిపోవడంతో అతన్ని విచారిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన

తమ పిల్లల్ని కొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

ఇంత జరిగినా ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదు.

ఇవీ చదవండి:వంతెన ప్రమాదంపై దర్యాప్తు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details