నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి గ్రామానికి చెందిన శంకర్ శనివారం రాత్రి బాగా తాగాడు. మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు వడ్డేగాని గోపమ్మపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికైనా చెబుతుందోనేమోనని గొంతునులిమి హత్య చేశాడు.
మద్యం మత్తులో వృద్ధురాలిపై హత్యాచారం - వృద్ధురాలిపై అత్యాచారం చేసిన యువకుడు
పూటుగా మద్యం సేవించాడు. మత్తులో ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమె గొంతు నులిమి హత్య చేశాడో దుర్మార్గుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![మద్యం మత్తులో వృద్ధురాలిపై హత్యాచారం 85 years old women rape in nalgonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6258414-717-6258414-1583065577772.jpg)
మద్యం మత్తులో వృద్ధురాలిపై హత్యాచారం
ఉదయం కోడలు టీ ఇవ్వడానికి వెళ్ళగా... నిర్జీవంగా పడిఉన్న గోపమ్మను చూసి గట్టిగా కేకలు వేసింది. పరిగెత్తుకొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి శంకర్.. గోపమ్మతో మాట్లాడడం చూశామని చుట్టుపక్కల వారు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా... తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో వృద్ధురాలిపై హత్యాచారం