పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను నల్గొండ కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి - ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించనున్నట్లు తెలిపారు.
బుధవారం నుంచి మొదలయ్యే ఓట్ల లెక్కింపు కార్యక్రమం కోసం అధికారులు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణనిచ్చారు. కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సహాయ రిటర్నింగ్ అధికారులు, అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏఆర్వోలకు ఇంకా తుది దశ శిక్షణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. లెక్కింపు ప్రక్రియ రెండ్రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఇందుకోసం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడితే దేశద్రోహమేనా...?'