పాజిటివ్ కేసులతో హైదరాబాద్ జంట నగరాలు బెంబేలెత్తిపోతుంటే... శివారు జిల్లాల్లోనూ వాటి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత వారం వ్యవధిలోనే... కేసులు రెట్టింపయ్యాయి. గత నెల 26 నాటికి 29 కేసులతో ఉన్న నిన్నటికి 79కి చేరుకుంది. ఈ ఎనిమిది రోజుల్లోనే 50 కేసులు పెరిగాయి. అదే సమయంలో సూర్యాపేట జిల్లాలో 14, యాదాద్రి జిల్లాలో 12 పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. ఇలా మూడు జిల్లాల పరిధిలో వారం వ్యవధిలోనే... 76 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కేసుల వివరాలు ఇలా...
శుక్రవారం నల్గొండలో ఏడు, సూర్యాపేటలో ఏడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. యాదాద్రిలో నమోదైన కేసుల్లో ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత... ఆమె వ్యక్తిగత సహాయకుడితోపాటు అంగరక్షకుడు సైతం వ్యాధి బారిన పడ్డారు. ఇక ఆలేరు బ్యాంకులో పనిచేసే మహిళా ఉద్యోగి, వలిగొండకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి, భువనగిరి ఏఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్‌కు... వైరస్ సోకింది.
రావాల్సిన 337 ఫలితాలు