తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు నోముల అంత్యక్రియలు.. హాజరుకానున్న కేసీఆర్​​ - nagarjuna sagar mla died

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియులు ఇవాళ జరగనున్నాయి. నకిరేకల్ మండలం పాలెంలోని వారి కుటుంబానికి చెందిన.. స్మృతివనంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

nomula
నేడు నోముల అంత్యక్రియలు.. హాజరుకానున్న కేసీఆర్​​

By

Published : Dec 3, 2020, 5:41 AM IST

హైదరాబాద్​ అపోలో ఆస్పత్రిలో మంగళవారం హఠాన్మరణం చెందిన తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెంలోని వారి కుటుంబానికి చెందిన.. స్మృతివనంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌ బేగంపేట నుంచి హెలిక్యాప్టర్‌లో పాలెం వెళ్లనున్నారు. నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details