తెలంగాణ

telangana

ETV Bharat / state

Mla Bhagath: నాగార్జున సాగర్‌ శాసనసభ్యుడిగా భగత్‌ ప్రమాణస్వీకారం - Nomula Bhagat was sworn as a MLA

శాసనసభ్యుడిగా నోముల భగత్‌ ప్రమాణస్వీకారం చేశారు. సభాపతి పోచారం ప్రమాణం చేయించారు. ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నోముల భగత్‌ గెలుపొందారు.

Nomula Bhagat was sworn as a MLA in telangana Assembly
నోముల భగత్‌ శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం

By

Published : Aug 12, 2021, 10:36 AM IST

Updated : Aug 12, 2021, 11:20 AM IST

Mla Bhagath: నాగార్జున సాగర్‌ శాసనసభ్యుడిగా భగత్‌ ప్రమాణస్వీకారం

నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో విజయం సాధించిన నోముల భగత్‌ (Nomula Bhagat) శాసనసభ్యుడిగా (MLA) ప్రమాణ స్వీకారం చేశారు. భగత్‌తో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు భగత్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య అనారోగ్య సమస్యలతో మరణించారు. దీనితో నాగార్జునసాగర్​లో సాగర్‌లో ఉపఎన్నిక వచ్చింది. తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన నర్సింహయ్య తనయుడు భగత్.... కాంగ్రెస్‌ సీనియర్‌ జానారెడ్డిపై 18 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ప్రమాణస్వీకారం సందర్భంగా మంత్రులు, అధికారులు భగత్‌కు శుభాకాంక్షలు తెలిపి, సన్మానించారు.

గత ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 88 స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, తెదేపా నుంచి ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు పార్టీ మారడంతో తెరాస సంఖ్య 104కు చేరింది. ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్​కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. భాజపా నుంచి ఇద్దరు ఉన్నారు.

దుబ్బాక, హుజూర్​నగర్ ఉపఎన్నికలు రావడంతో... దుబ్బాకలో తెరాస పరాజయం పొందగా... హుజూర్​నగర్​లో తెరాస విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే హుజూరాబాద్​లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది.

పార్టీ స్థానాలు
తెరాస 104(103+1)
ఎంఐఎం 7
కాంగ్రెస్ 6
భాజపా 2
ఖాళీ 1

ఇదీ చూడండి: సాగర్‌లో తెరాస అభ్యర్థి నోముల భగత్​ విజయం

Last Updated : Aug 12, 2021, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details