కృష్ణా బేసిన్‌లో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్ నిర్వహణపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2009లో కృష్ణాకు వచ్చిన భారీవరదలకు జలాశయం స్పిల్‌వేకు భారీగా గుంతలుపడ్డాయి. తాత్కాలిక మరమ్మతులతో అధికారులు చేతులు దులుపుకున్నారు. అప్పటినుంచి అనేక సార్లు వరదలు వచ్చి క్రస్ట్ గేట్లు ఎత్తినపుడల్లా లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదలతో మళ్లీ స్పిల్‌వే దెబ్బతింది. ఎగువన కృష్ణా ప్రాజెక్టులకు వరద రాక మొదలైంది. స్పిల్ వేకు మరమ్మతుల్లో జాప్యం వల్ల ఈసారి వరదలకు తట్టుకుంటుందా అనే సందేహాలు.... నీటిపారుదల ఇంజినీర్ల నుంచే వ్యక్తమవుతోంది. స్పిల్‌వే నిర్వహణకు 40 కోట్లు అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదు. గతంలో నాసిరకంగా చేసిన పనుల వల్ల స్పిల్‌వే పటిష్ఠతపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
స్పిల్‌వేపై భారీ గుంతలు