నల్గొండ జిల్లా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ... బస్సులను నడపకుండా తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను అడ్డుకున్నారు. ఏ ఒక్క బస్సును కూడా బయటకు రానీయకపోవడం వల్ల ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసుల సమక్షంలో ప్రస్తుతం ఒక్కో బస్సును నడిపిస్తున్నారు. ఉదయం 5-11 గంటల వరకు రోడ్డుపైకి ఒక్క బస్సు కూడా రాలేదని... కార్మికులకు ప్రభుత్వానికి మధ్య ఏమైనా సమస్యలు ఉంటే త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. కానీ అలా ఇలా ప్రజలను ఇబ్బందులు పాలుచేయడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే... అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఇప్పడిప్పుడే రోడ్లపైకి వస్తున్న ఆర్టీసీ బస్సులు - TSRTC WORKERS STRIKE AT NALGONDA
నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఉదయం నుంచి ఒక్క బస్సు కూడా డిపోలోంచి బయటకు రాలేదు. ఇప్పడిప్పుడే ఒక్కో బస్సు... రోడ్డుపై తిరుగుతోంది.
![ఇప్పడిప్పుడే రోడ్లపైకి వస్తున్న ఆర్టీసీ బస్సులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4831958-256-4831958-1571736421377.jpg)
ఇప్పడిప్పుడే రోడ్లపైకి వస్తున్న ఆర్టీసీ బస్సులు