నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా పురపాలికలో నివాసముండే 41 మంది ఈ నెల మొదటివారంలో తీర్థ యాత్రలకు వెళ్లారు. వారు నేపాల్, వారణాసి ప్రాంతాల్లో తిరిగి హైదరాబాద్ మీదుగా స్వస్థలం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న నల్గొండ జిల్లా వైద్య బృందం వారిని గుర్తించింది.
41 మందిపై క్వారంటైన్ ముద్ర - నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా
ఈ మధ్య కాలంలో విదేశాల్లో పర్యటించి వచ్చిన కొందరు హాలియా నివాసితుల్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వాళ్లకు క్వారంటైన్ ముద్ర వేసి గృహ నిర్బంధంలోకి పంపారు.
![41 మందిపై క్వారంటైన్ ముద్ర nlg-dmho-visited-haliya-for-corona-suspected-case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6507572-thumbnail-3x2-dmho.jpg)
41 మందిపై క్వారంటైన్ ముద్ర
వాళ్లలో కరోనా లక్షణాలు లేనప్పటికీ వారిపై క్వారంటైన్ ముద్ర వేసి గృహ నిర్బంధంలోకి పంపామని జిల్లా వైద్యాధికారి కొండల్ రావు తెలిపారు. వాళ్లకు తగిన ఆరోగ్య సలహాలు సుచనలు చేశారు.
41 మందిపై క్వారంటైన్ ముద్ర
ఇదీ చూడండి:చప్పట్లతో మార్మోగిన దేశం.. జనతా కర్ఫ్యూకు విశేష స్పందన