తెలంగాణ

telangana

ETV Bharat / state

షాపుల సముదాయాన్ని ప్రారంభించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి - తెలంగాణ వార్తలు

ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దేవరకొండ పట్టణంలోని కోదండరామాలయం ముందు ఏర్పాటు చేసిన షాపుల సముదాయాన్ని ప్రారంభించారు. చిన్న వ్యాపారులకూ అక్కడ దుకాణాలు ఇవ్వడం పట్ల గుత్తా హర్షం వ్యక్తం చేశారు. దుకాణాల ద్వారా కొంత మంది నిరుద్యోగులకైనా ఉపాధి లభిస్తుందన్నారు.

new shoping complex opened by gutha sukhender reddy
షాపుల సముదాయాన్ని ప్రారంభించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి

By

Published : Dec 25, 2020, 7:11 PM IST

దేవాలయ అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రధాన రోడ్డుపై ఉన్నటువంటి దుకాణాల ద్వారా కొంత మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతారన్నారు. దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి పట్టణంలోని కోదండరామాలయం ముందు ఏర్పాటు చేసిన షాపుల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.

"చిన్న వ్యాపారులకూ ఇక్కడ దుకాణాలు ఇవ్వడం హర్షణీయం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇలాంటి శుభప్రదమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. దేవరకొండ పట్టణంలో దేవాలయాలు నలుదిక్కులా విస్తరించి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక పథంలో ముందుకు సాగాలి."

-గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్

"కోదండ రామాలయం మరింత అభివృద్ధి సాధించాలి. దాతల మీద ఆధారపడకుండా అంచలంచెలుగా దేవాలయానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. సముదాయాల ఏర్పాటుతో వచ్చే ఆదాయం ద్వారా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి. "

-రమావత్ రవీంద్ర కుమార్, దేవరకొండ శాసనసభ్యులు

కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, రవీందర్‌గౌడ్, గాజుల రాజేష్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 16 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details