తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉమ్మడి నల్గొండలో కొత్తగా 26 కరోనా కేసులు' - COVID LATEST NEWS

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నూతనంగా 26 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 129కు చేరుకుంది.

'ఉమ్మడి నల్గొండలో కొత్తగా 26 కరోనా కేసులు'
'ఉమ్మడి నల్గొండలో కొత్తగా 26 కరోనా కేసులు'

By

Published : Jul 7, 2020, 9:48 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 7 కేసులను గుర్తించినట్లు ఆయా జిల్లాల వైద్యాధికారులు తమ బులెటెన్లలో పేర్కొన్నారు. నల్గొండకు సంబంధించి 5 మండలాల పరిధి హాలియాలో 4, మిర్యాలగూడలో 3, చింతపల్లిలో 2 కేసులు వెలుగుచూశాయి.

125 నుంచి 129 వరకూ...

కొండమల్లేపల్లి, పెద్దవూర, చండూరు, దేవరకొండ, నార్కట్ పల్లి మండలాల్లో ఒక్కో వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. వీటితో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 125కు చేరుకుంది. సూర్యాపేట జిల్లాలో తాజాగా 7 కేసులు నిర్ధరణయ్యాయి. జిల్లా కేంద్రంలో ఐదుగురు, అర్వపల్లి, హుజూర్ నగర్ మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్​కు గురయ్యారు. ఫలితంగా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 129కు చేరుకుంది.

ఇవీ చూడండి : రైతుపై బ్యాంక్ సిబ్బంది దాడి.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details