నల్గొండ జిల్లాలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు వ్యయం దాదాపు రూ.640 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక్కడున్న చిన్నతరహా ఎత్తిపోతల సామర్థ్యం పెంచి నాలుగువేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేలా ప్రభుత్వం గత నెలలో రూ.74 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన కూడా చేశారు. నెల్లికల్లు కింద 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉందని విశ్రాంత ఇంజినీర్ల సంఘం పలుమార్లు చేసిన విజ్ఞప్తులకు స్పందించి ప్రభుత్వం సామర్థ్యం పెంచేందుకు నిర్ణయించింది. సంబంధిత డిజైన్లు, లైన్ డయాగ్రం సిద్ధమవ్వగా ప్రతిపాదనల దస్త్రాన్ని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రెండున్నర టీఎంసీలు ఎత్తిపోసేలా...